మా అన్నయ్య టైలరింగ్ పని చేస్తారు. పండుగల సమయంలొ సాదారణంగా పని ఎక్కువగా ఉంటుంది. అందువలన రాత్రులు కూడా పనిచెసేవాళ్ళు. అయినప్పటికి కొన్నిసార్లు డ్రెస్సులు పూర్తి అయ్యేవికావు. తెల్లవారగానే కొత్తబట్టలు తీసుకువెళ్ళటానికి పిల్లలు, పెద్దలు షాపు వద్దకు రావటం మొదలవుతుంది. పెద్దవాళ్ళకు ఏదోలా సర్దిచెప్పి మళ్ళీ రమ్మని చెప్పి పంపేవాళ్ళు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం బట్టలు ఇచ్చేంతవరకు వెళ్ళేది లేదని మొండికేసేవాళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళ గొడవ భరించలేక వాళ్ళకి ఒకపనిని అప్పగించేవాళ్ళు. డెస్స్ అంతా కుట్టడం పూర్తయిందని, ఇంక కొంచెం నల్ల తెలివి చేరిస్తే చాలని చెప్పేవాళ్ళు. దానికి వాళ్ళు వెంటనే అది ఎక్కడ దొరుకుతుందో చెప్తే తీసుకువస్తామనేవాళ్ళు. వాళ్ళకి రెండు రూపాయలు ఇచ్చి సెంటెర్లో ఉన్న షాపులొ దొరుకుతుంది త్వరగా తీసుకురమ్మని చెప్పే వాళ్ళు. వాళ్ళు అది నిజమే అనుకుని ఆ షాపుకు వెళ్ళే వాళ్ళు. షాపు అతన్ని రెండు రూపాయలకు నల్ల తెలివి ఇవ్వమని అడిగేవాళ్ళు. వాళ్ళకు ఏమికావాలొ అర్దంకాని షాపు అతను ఒకటికి రెండుసార్లు అసలు ఏంకావాలో తెలుసుకోవటానికి ప్రయత్నించి ఇకలాభంలేదని ఎవరు పంపించారు అని అడిగేవాడు. పలానా టైలర్ పంపించాడని చెప్పగానే సరదాకి పంపించారని అర్దమై నా వద్ద నల్ల తెలివి లేదు కాని తెల్ల తెలివి వుంది. కావాలేమో కనుక్కుని రమ్మని పంపేవాడు. వాళ్ళు పరుగుపరుగున వచ్చి అక్కడ నల్ల తెలివి లేదు తెల్ల తెలివిమత్రమే వుందని చెప్పేవాళ్ళు. షాపు అతను కావాలనే అబద్దం చెప్పాడని, అతని వద్ద నల్ల తెలివి వుందని చెప్పి మళ్ళీ పంపే వాళ్ళు. అలా వాళ్ళని కొంతసేపు అటు ఇటు తిప్పేవాళ్ళు. కొంతమంది చిరాకేసి ఇంటికివెళ్ళి వస్తామని చెప్పి వెళ్ళిపోయేవారు. ఒకవేళ రెండోసారి ఎవరినైనా అలా షాపుకు వెళ్ళి నల్ల తెలివి తీసుకురమ్మంటే వాళ్ళుమాత్రం ఆ షాపులొ కేవలం తెల్ల తెలివి మాత్రమే వుందని చెప్పేవాళ్ళు. ఆ షాపు అతను తమకు నల్ల తెలివి ఇవ్వటం లేదని, అందువలన తాము మాత్రం ఆ షాపుకు మళ్ళీ వెళ్ళేది లేదని తేల్చి చెప్పేవాళ్ళు. అలా వాళ్ళు పనివత్తిడిని మరియు ఈ పిల్లల వత్తిడిని తగ్గించుకునే వాళ్ళు. ఇప్పుడు అంతా రెడిమేడ్ డ్రెస్సులు వచ్చి వాళ్లకు పని బాగా తగ్గిపోయింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి